[caption id="attachment_6238" align="alignright" width="1280"]
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-అభంగపట్నం, సెప్టెంబర్ 19:
అభంగపట్నం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు శనివారం సర్పంచ్ శ్రీమతి గైని వసంత సతీష్ చేతుల మీదుగా యూనిఫాంలు, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆమె సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపి గౌడ్, వార్డు సభ్యులు కొండ్ర గంగాధర్, బేగరి సురేష్, పాఠశాల చైర్మన్ జి. సురేఖ, ప్రధానోపాధ్యాయురాలు అనిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.[/caption]