Logo
Date of Publish : 16 September 2026, 9:08 pm
Editor : Katta Ravindar

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

తెలుగు కె న్యూస్ సంగారెడ్డి జిల్లా: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందారు.పెద్దకంజర్ల శివారులోని శిరీష అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులు వినాయక నిమజ్జన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు కుంటలో పడటంతో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )