Logo
Date of Publish : 06 August 2026, 1:03 pm
Editor : Katta Ravindar

శిశువుకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం – ప్రతి తల్లి తల్లిపాలను తప్పనిసరిగా అందించాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం, అలాగే "బేటీ బచావో – బేటీ పడావో" కార్యక్రమంలో భాగంగా బేబీ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, నవజాత శిశువుకు తల్లిపాలు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని తెలిపారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.

తల్లులు మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, డబ్బా పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని సూచించారు. ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లను బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిపాల ప్రాముఖ్యతపై సమాజంలో మరింత అవగాహన కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

అనంతరం "బేటీ బచావో బేటీ పడావో" కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లులకు జిల్లా కలెక్టర్ బేబీ కిట్లను పంపిణీ చేశారు. ఆడబిడ్డ పుట్టుకను కుటుంబాలు ఆనందంగా స్వాగతిస్తూ, బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో ఈ తరహా బేబీ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ యన్ వై గిరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్, కామారెడ్డి ప్రాజెక్టు ఇన్‌చార్జి సీడీపీవో కవిత, తహసీల్దార్ శ్వేత, వైద్యాధికారి డాక్టర్ కాశీ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, గ్రామ సర్పంచ్ మల్లవ్వ, జిల్లా మహిళా సాధికారత సిబ్బంది, పోషణ్ అభియాన్ సమన్వయకర్త, ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, బాలింతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )