జైపూర్: తెలుగు కే న్యూస్ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రకృతిమిత్రస్వామి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా ఏర్పాటు.
ఈ సందర్భంగా జైపూర్ ఎంపీడీవో శ్రీపతి బాపురావు మాట్లాడుతూ.. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణంతో పాటు జలచరాలను కాపాడవచ్చన్నారు. ప్రజలు ప్రకృతిపై అవగాహన పెంచుకొని పర్యావరణానికి హాని కలగకుండా మట్టి వినాయకులను ఉపయోగించాలని సూచించారు.
కార్యక్రమంలో కమిటీ ఆలయ అధ్యక్షుడు గోనె విజయబాబురావు, క్యాషియర్ చిత్తారి తిరుపతి, కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు.