Logo
Date of Publish : 23 September 2026, 10:47 am
Editor : Katta Ravindar

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడిగా వంగల భాస్కరా చారి

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 23 :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా వంగల భాస్కర చారి నియమితులయ్యారు. ఈ మేరకు కమిటీ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తూ, వారి హక్కులను పరిరక్షించేందుకు కృషి చేయడంతో పాటు కమిటీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నూతన వైస్ ప్రెసిడెంట్ వంగల భాస్కరా చారి తెలిపారు.

జాతీయ వ్యవస్థాపకులు డా. చంటి ముదిరాజ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర శ్రావంతి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కె. సాయిరాం నాయకత్వంలో కమిటీ కార్యకలాపాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.

వంగల భాస్కరా చారి నియామకంపై కమిటీ నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )