Logo
Date of Publish : 21 September 2026, 4:30 pm
Editor : Katta Ravindar

స్త్రీనిధి రుణ సహాయంతో ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు :కామారెడ్డి జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధి మెరుగుదల, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా స్త్రీనిధి ద్వారా రుణ సహాయం అందించి కొనుగోలు చేసిన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోలను బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం పంపిణీ చేశారు.
స్త్రీనిధి ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.3 లక్షల చొప్పున ఇద్దరు లబ్ధిదారులకు మొత్తం రూ.6 లక్షల రుణ సహాయం అందించినట్లు అధికారులు తెలిపారు.
లబ్ధిదారుల వివరాలు
సాయి నందిని గ్రూప్
మాసన్‌పల్లి రజిత, భర్త శ్రీకాంత్ గౌడ్
దేశాయిపేట VO
సోమలింగేశ్వర గ్రూప్
బేపారి శోభ, భర్త మనోహర్ గాంధీ
దేశాయిపేట VO
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ అవసరాలకు అనుగుణంగా స్త్రీనిధి ద్వారా అందించే రుణ సహాయాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం వివిధ రకాల రుణ సహాయ కార్యక్రమాలను అమలు చేస్తోంది. స్త్రీనిధి ద్వారా పొందిన రుణాలతో ఆదాయాన్ని సమకూర్చే ఉపాధి మార్గాలను ఎంచుకొని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి అని కలెక్టర్ తెలిపారు.
ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా లబ్ధిదారులు నిరంతర ఆదాయం పొందేలా కృషి చేయాలి. స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి. అని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
ప్రభుత్వం అందిస్తున్న రుణ సహాయాన్ని సద్వినియోగం చేసుకొని మరింత మంది మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి కార్యకలాపాల వైపు ముందుకు రావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్. వై. గిరి, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, అదనపు డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డిఆర్ఓ పాండు, స్త్రీనిధి ఆర్‌ఎంకిరణ్, స్త్రీనిధి మేనేజర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీసీ), సంబంధిత అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )