Logo
Date of Publish : 21 September 2026, 8:13 am
Editor : Katta Ravindar

స్వప్నలోక్ లో ఘనంగా వినాయక నవరాత్రులు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి పట్టణంలోని స్వప్నలోక్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రతిరోజు వినాయకుని వద్ద ఉదయం, సాయంత్రం ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని, భక్తులు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాన్ని సమర్పించి అనంతరం సాంస్కృతిక నృత్యాలు, భక్తి గీతాలు ఆలపిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతి వంటి తదితర పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ పూజలో పాల్గొన్న వారికి అష్ట ఆయురారోగ్యాలతో పాటు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు. నవరాత్రులను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయకుని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆదివారం కుంకుమ పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత గంజి వెంకటేశం, స్వప్నలోక్ కాలనీ కార్యవర్గం, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )