Logo
Date of Publish : 12 September 2026, 9:04 am
Editor : Katta Ravindar

హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. అతను రాసిన పుస్తకాన్ని నిషేధించాలని అంబేద్కర్ ,ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాల డిమాండ్.

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు :కామారెడ్డి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశంలో అంబేద్కర్ ఉపాధ్యాయ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హమారా ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కించపరిచే విధంగా అనే పుస్తకాన్ని రాసి దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీల మనోభావాలను దెబ్బ చేసే విధంగా ఉందన్నారు. ఈ పుస్తకం ద్వారా దేశంలో రాష్ట్రంలో సృష్టించాలని కుట్రలో భాగంగానే మనువాదులు కుట్ర పన్నారన్నారు. అతని వెనుక ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని వారి పైన దేశద్రోహి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ప్రజాప్రతినిధులు ఈరోజు చూస్తూ ఉండడం హమారా ప్రసాద్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్పందించి హమారా ప్రసాద్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి రాష్ట్ర బహిష్కరణ అయ్యేవరకు ఉద్యమించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలన్నారు. ఈ సమావేశంలో
అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆకుల బాబు జిల్లా అధ్యక్షులు కొత్తల్ల గంగారం, ఎస్సీ ఎస్టీ ఉపాద్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగరి వెంకట్, డి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు అశోక్, హరికృష్ణ,ఐసా జిల్లా కన్వీనర్ జీవియం విఠల్ , బాంసిప్ రాష్ట్ర అధ్యక్షుడు దుబాసి నరేందర్, మూఢనమ్మకాల నిర్ములాన సంఘం జిల్లా అధ్యక్షులు గ్యార బాబు, ఎస్సీ ఎస్టి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు సంగయ్య, సాయి గౌతమ్, సురేష్ ,భూపతి,కొండ సంజువ్,పెద్ధోలు సాయిలు,బట్టు రాములు, తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )