Logo
Date of Publish : 01 July 2026, 2:32 pm
Editor : Katta Ravindar

హైదరాబాద్‌లో యూరోగ్రిప్ టైర్స్ ఐదు ప్రత్యేక రిటైల్ స్టోర్ల ప్రారంభం

శేరిలింగంపల్లి, K24 న్యూస్:
టీవీఎస్ శ్రీచక్ర లిమిటెడ్‌కు చెందిన యూరోగ్రిప్ టైర్స్ హైదరాబాద్‌లో ఐదు ప్రత్యేక రిటైల్ దుకాణాలను ప్రారంభించింది. కొండాపూర్‌లోని కూన్ హ్యుందాయ్ షోరూమ్ పక్కన ఉన్న స్టోర్‌ను యూరోగ్రిప్–మిలాన్ డిజైన్ హెడ్ సిల్వియో మొంటానారి ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీవీఎస్ శ్రీచక్ర చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ టి.కె. రవి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో రిటైల్ విస్తరణతో నాణ్యమైన టైర్లు, సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేస్తున్నామని తెలిపారు.
ఈ స్టోర్లలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అన్ని రకాల టైర్లు, ట్యూబ్‌లు, టైర్ ఫిట్‌మెంట్, పంక్చర్ మరమ్మతులు, ఎయిర్ ప్రెజర్ తనిఖీలు, వారంటీ సేవలు అందుబాటులో ఉంటాయి.
కొత్త స్టోర్లు కొండాపూర్, ఈస్ట్ మారేడ్‌పల్లి, ఎల్‌బీ నగర్ (చింతలకుంట), గోపనపల్లి (శేరిలింగంపల్లి), గుల్‌మోహర్ పార్క్ కాలనీ ప్రాంతాల్లో వినియోగదారులకు సేవలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )