Logo
Date of Publish : 23 September 2026, 8:32 pm
Editor : Katta Ravindar

420 మంది పోలీస్ లతో భారీ బందోబస్తు కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సాఫీగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్23 :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా సుమారు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు శోభాయాత్ర మార్గంలో 162 సీసీ కెమెరాలు, 3 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్ నిమజ్జన బందోబస్తుపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అధికారులు , సిబ్బందితో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బందోబస్తు యందు చేయవల్సిన మరియు చేయకూడాని వాటిపై పూర్తిగా వివరించారు.శోభాయాత్ర రూట్‌లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ట్రాఫిక్ జంక్షన్లు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమన్వయంతో, ఓపికతో విధులు నిర్వహిస్తూ, అవసరమైనప్పుడు వెంటనే స్పందించాలని ఆదేశించారు.
శోభాయాత్రలో పాల్గొనే భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, నిర్దేశిత రూట్ మ్యాప్ ప్రకారం శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు, నిమజ్జన ఘాట్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట బారికేడింగ్, ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయనున్నట్లు చెప్పారు.

గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనే భక్తులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు. అత్యుత్సాహంతో ప్రమాదకర విన్యాసాలు చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనడం, వాహనాలు నడపడం చేయకూడదని, వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించాలని సూచించారు. డీజేలు, సౌండ్ సిస్టమ్స్‌కు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
నిమజ్జన ప్రాంతాల్లో పిల్లలు, ఈత రాని వారు నీటిలోకి దిగకుండా తల్లిదండ్రులు, నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నిమజ్జనం సమయంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి వివాదాలు, గొడవలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ఇతరులను రెచ్చగొట్టే విధంగా నినాదాలు, వ్యాఖ్యలు చేయకుండా ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని ఎస్పీ సూచించారు.
పోలీసు అధికారులు, సిబ్బంది 24×7 అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా లేదా ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వెంటనే సమీపంలోని పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నిమజ్జనం అనంతరం రహదారులపై చెత్త, వ్యర్థాలు వేయకుండా పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని ప్రజలు, నిర్వాహకులను కోరారు. భక్తి, ఆనందంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించుకోవచ్చని ఎస్పీ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పోలీసు శాఖ తరఫున అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కోరారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )