K24 News Telugu
Date of Publish : 26/10/2026, 2:05 pm
Published By srikanth

అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు – రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడిని పట్టుకున్న పోలీసులు

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 26:k24 న్యూస్ తెలుగు : గాంధారి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న SBI ATM వద్ద తేదీ 10/11-10-2026 నాడు అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నైటీలు ధరించి గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి, నగదుతో ఉన్న ఐదు బాక్సులను అపహరించారు. ఈ ఘటనలో మొత్తం రూ.25,45,900 నగదు చోరీకి గురైనట్లు సంబంధిత బ్యాంకు సంస్థ ప్రతినిధి ఫిర్యాదు చేయగా గాంధారి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 220/2026 గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

• ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాలలో కామారెడ్డి సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, పిట్లం ఎస్సై ఆంజనేయులు, సదాశివనగర్ యస్ఐ పుష్పరాజ్‌, ఇతర అధికారులతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు. నేరం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు నేరానికి ముందు రోజు నుండి CCTV కెమరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అనుమనితుల కదలికలు, వాహనం గుర్తింపు సమాచారంతో ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంచేసుకుంటూ గాలింపు చర్యలు తీవ్రతరం చేయడం జరిగింది.  

• నేరం జరిగిన విధానం:

• పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో నిందితుల ముందస్తు పక్కా ప్రణాళిక వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ATM లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడినట్లు తేలింది. ఈ నేరాల కోసం నల్లరంగు మహీంద్రా స్కార్పియో వాహనాన్ని వాడుతూ, పోలీసుల కళ్లుగప్పేందుకు అసలు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లకు బదులుగా ఇతర వాహనాల నంబర్ గల ప్లేట్లను మారుస్తూ వారి ప్రయాణం కొనసాగించారు.    

• సెప్టెంబర్ 2026లో కరీంనగర్ ప్రాంతంలోని రెండు ఎస్‌బీఐ ఏటీఎంల వద్ద గ్యాస్ కట్టర్ సహాయంతో చోరీలకు పాల్పడినట్లు విచారణ ద్వారా తెలిసింది.    

• 10-10-2026 రాత్రి నిందితులు మరోసారి తెలంగాణకు వచ్చి ఏటీఎంలను పరిశీలించారు. గాంధారి గ్రామానికి వచ్చే మార్గంలో ఒక వెల్డింగ్ షాప్ తాళం పగలగొట్టి ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు నేరానికి ఉపయోగపడు సంబంధిత పరికరాలను దొంగిలించారు. అనంతరం గాంధారి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు చేరుకుని వారిని గుర్తుపట్టకుండా ఉండేడుకు మాస్కులు, క్యాప్‌లు, నైటీలు ధరించి ముడుగా ATM నందు ఉన్న CCTV కేమరాలు పనిచేయకుండా వాటిపై 

• నలుపు స్ప్రే వాడి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి, నగదుతో ఉన్న ఐదు బాక్సులను స్కార్పియో వాహనంలో వేసుకుని పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది.

• రాజస్థాన్ పోలీసులతో సమన్వయంతో 

• చోరీ విషయం తెలిసిన వెంటనే జిల్లా పోలీసులు రంగంలోకిదిగి ముందుగా నేరస్తులు వాడిన వాహనం స్కార్పియో గా గుర్తించి చోరీ అనంతరం అట్టి నిందితులు వాహనంలో మన రాష్ట్రం దాటి పరారయ్యారు అని మహారాష్ట్ర, రాజస్థాన్ వైపు వెళ్తున్నట్లు గుర్తించిన కామారెడ్డి పోలీసులు సంబంధిత రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. చివరికి రాజస్థాన్‌లోని చేచాట్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి, బారికేడ్లు, రోడ్డు నిరోధక పరికరాల సహాయంతో వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాహనం ఎడమవైపు టైరు దెబ్బతినడంతో నిందితులు కొంతదూరం వెళ్లి వాహనాన్ని వదిలిపెట్టి, నగదు ఉన్న బ్యాగుతో సహా పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది.

• రాజస్థాన్‌లో నిందితుడి అరెస్టు

• ప్రత్యేక బృందాలు ముందుగా రాజస్తాన్ చేరుకొని నిందితులు ఆచూకీ కోసం పూర్తి స్టాయిలో దర్యాప్తు కొనసాగించాయి. ఈ క్రమంలో 20-10-2026 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో రాజస్థాన్ రాష్ట్రంలోని బరోడామేవ్ సమీపంలో భరత్పూర్ రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న రషీద్‌ను కామారెడ్డి పోలీస్ బృందాలు బృందం గుర్తించి అదుపులోకి తీసుకుంది. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కామారెడ్డి తీసుక రావడం జరిగింది. తేదీ 21-10-2026న రాజస్థాన్‌లోని చేచాట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న నల్లరంగు మహీంద్రా స్కార్పియో వాహనాన్ని గుర్తించి, అందులో ఉన్న గ్యాస్ కట్టింగ్ పరికరాలు, ఇతర పనిముట్లు, సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాహనం వెనుక సీటు కింద దాచిన రెండు కత్తులు, ఒక ఇనుప రాడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

• నిందితుడి వివరాలు : రషీద్, తండ్రి హలాం, వయస్సు: 30 సం. లు, నివాసం రాజస్థాన్ రాష్ట్రం.  

• స్వాధీనం చేసుకున్న వస్తువులు

• 1. నగదు – రూ.29,400.

• 2. మొబైల్ ఫోన్లు-2 

• 3. నల్లరంగు మహీంద్రా స్కార్పియో వాహనం 

• 4. గ్యాస్ కట్టింగ్ నాజిల్, ఆక్సిజన్ సిలిండర్‌కు సంబంధించిన పరికరాలు, రెగ్యులేటర్, చెక్ మీటర్, పైపులు, ఇతర పనిముట్లు.

• 5. ఇనుప రాడ్లు, స్క్రూడ్రైవర్, అడ్జస్టబుల్ పానా, హ్యాక్సా బ్లేడ్ తదితర పరికరాలు.

• 6. వివిధ నంబర్లు గల నంబర్ ప్లేట్లు. 

• 7. మాస్కులు, దుస్తులు, వీల్ రిమ్ తదితర వస్తువులు.

• 8. 3-ఇనుప కత్తులు, 1-ఇనుప రాడ్.

• నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచనున్న పోలీసులు

• ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుడు రషీద్‌ను ఈ రోజు 26-10-2026న న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు మరియు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ని వెల్లడించారు. అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగతనం కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజ్‌లతో పాటు ఐటీ కోర్ ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సీసీఎస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, లక్ష్మీకాంత్, సదాశివనగర్ కానిస్టేబుల్ అజార్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ప్రత్యేకంగా అభినందించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save