జి.డి నెల్లూరు మండల కేంద్రంలోని ఆర్టీఐ అవేర్నస్ సంస్థ జాతీయ ఉపకార్యాలయంలో ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి అధ్యక్షతన నేషనల్ డైరెక్టర్ కె.హేమకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుధ పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఫౌండర్ పట్టాభి రెడ్డి మాట్లాడుతూ సంస్థ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు పారదర్శకతను చేకూర్చడంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా స్థానిక పత్రిక పాత్రికేయులు రమేష్, జయచంద్ర నాయుడు, రామూర్తిరెడ్డి, సుధా, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు జయచంద్ర నాయుడు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై స్వచ్ఛందంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఈ సంస్థ సేవలు అభినందించదగ్గవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ ఎస్.హెచ్. రాంప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ డి.కె. కుమార్, బోర్డు డైరెక్టర్లు గిరి బాబు, పుష్పరాజ్, శ్రీనివాసులు రెడ్డి, లోకనాధం నాయుడు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు టీ.పట్టాభి తదితరులు పాల్గొని