K24 News Telugu
Date of Publish : 26/10/2026, 7:58 pm
Published By P RAJESHKUMAR

అక్టోబర్ 30నే NTR భరోసా పింఛన్లు

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) అక్టోబర్ 26. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థలు మరియు ZPTC, MPTC ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారులకు అందే పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేస్తూ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేశారు. నిర్ణయించిన తేదీల ప్రకారం నవంబర్ ఒకటో తేదీకి బదులుగా అక్టోబర్ 30వ తేదీ శుక్రవారమే పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరియు పోలింగ్ ఏర్పాట్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అంతరాయం లేకుండా లబ్ధిదారుల చేతికి పింఛన్ సొమ్ము అందేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.ఈ నేపథ్యంలో అన్ని మండలాల అధికారులు అప్రమత్తమై స్థానిక బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లతో ముందుగానే సంప్రదింపులు జరపాలని సూచించారు. అక్టోబర్ 29వ తేదీ నాటికి అవసరమైన నగదు బ్రాంచ్లలో అందుబాటులో ఉండేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.పింఛన్ల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు హెచ్చరించారు. లబ్ధిదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save