కామారెడ్డి జిల్లా అక్టోబర్ 27: k24 న్యూస్ తెలుగు: నియోజకవర్గ ఇన్‌చార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో బిక్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రవీందర్ గుప్తా మాట్లాడుతూ, తెలంగాణలో భవిష్యత్తులో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఏర్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ పంచజన్యాన్ని ఇంటింటికీ, గడపగడపకు తీసుకెళ్లాలని సంకల్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ పోటీ అభ్యర్థి, సీనియర్ నాయకుడు పాత బైరవయ్య గుప్తా, సీనియర్ మహిళా నాయకురాలు సనా, ఏసు, జెండా పండుగ ఇన్‌చార్జ్ అరవింద్, శివ, రణదీష్, రాజేష్, సిద్ధప్ప, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు.