K24 News Telugu
Date of Publish : 27/10/2026, 5:35 pm
Published By suman

పిల్లలు పుట్టడం లేదంటూ భార్యను హతమార్చిన భర్త

కరీంనగర్ తెలుగు కే న్యూస్ అక్టోబర్ 27

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య మృతికి సంబంధించి భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా, ఎలిగేడు మండలం, లాలపల్లి గ్రామానికి చెందిన నాతరి చంద్రయ్య తన కుమార్తె సుమారు 18 సంవత్సరాల క్రితం కరీంనగర్ కు చెందిన దావ చంద్రమౌళికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహమైన తర్వాత సుమారు 12 సంవత్సరాల వరకు వారికి సంతానం కలగకపోవడంతో చంద్రకుమార్ తన భార్యను తరచూ వేధించేవాడని, పిల్లలు పుట్టడం లేదంటూ దూషిస్తూ, మరో వివాహం చేసుకుంటానని బెదిరిస్తూ శారీరకంగా హింసించేవాడని స్వరూప తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో స్వరూపకు ఒక కుమార్తె జన్మించినప్పటికీ, తనకు మగ సంతానం కావాలంటూ చంద్రకుమార్ వేధింపులు కొనసాగించాడని ఫిర్యాదులో తెలిపారు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొట్టడం, ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధించడం, పలుమార్లు రాత్రి వేళల్లో ఆమెను పుట్టింటి వద్ద వదిలేక్షణం చేసేవాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు పలుమార్లు నచ్చజెప్పినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో చంద్రకుమార్ తన భార్య స్వరూపను చేతితో, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి తీసుకెళ్లాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం స్వరూప మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉందని సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్ కు చేరుకున్నారు. ఆమె మెడ కింది భాగంలో గీతల గాయాలు, కమిలిన గాయాలు కనిపించడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు సంఘటన జరిగిన రాత్రి సుమారు 12 గంటల సమయంలో చంద్రకుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారని, తన కుమార్తెను భర్త గొంతు నులిమి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తూ తండ్రి చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పరిశీలించగా మెడ కింది భాగంలో గీతల గాయాలు, కమిలిన గాయాలు ఉన్నాయని, అనుమానిత మృతిగా పంచనామా నిర్వహించి, వైద్యులచే పోస్టుమార్టం చేయించి తదనంతర మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం మృతురాలి తండ్రికి అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో పట్టుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save