బెజ్జంకి, తెలుగు కె న్యూస్ అక్టోబర్ 27: సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి సేవించినట్లు పరీక్షల్లో తేలిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వడ్లూరు గ్రామ శివారు నుంచి ఖాసీంపేట గ్రామానికి వెళ్లే మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అన్నాడి కల్యాణ్ రెడ్డి (27) అనే వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించి విచారించారు.ఈ క్రమంలో అతడికి పరీక్షలు నిర్వహించగా, పంచుల సమక్షంలో జరిపిన పరీక్షలో గంజాయిలో ఉండే టెట్రాహైడ్రోకాన్నబినాల్ (THC)కు సంబంధించిన ఫలితం సానుకూలంగా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఘటనపై బెజ్జంకి పోలీస్స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలియువతతో పాటు ప్రజలందరూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బెజ్జంకి పోలీసులు సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి అక్రమ వినియోగం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.