K24 News Telugu
Date of Publish : 28/10/2026, 2:25 pm
Published By Katta Ravinder

సేవా రత్న జాతీయ పురస్కారానికి వింజపల్లి సర్పంచ్ దంపతులు ఎంపిక

  • ఉత్తమ సర్పంచ్‌గా అన్నాడి శ్రీజ.. ఉత్తమ సేవా విభాగంలో అన్నాడి జీవన్ రెడ్డికి అవార్డు

కోహెడ, అక్టోబర్ 28 (కే24 న్యూస్): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అన్నాడి శ్రీజ, ఆమె భర్త అన్నాడి జీవన్ రెడ్డి ప్రతిష్టాత్మక సేవా రత్న జాతీయ పురస్కారం–2026కు ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ (బీఎస్ఏ) ఆధ్వర్యంలో అందించే ఈ పురస్కారాలకు ఒకే కుటుంబానికి చెందిన దంపతులు రెండు విభాగాల్లో ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.బహుజన సాహిత్య అకాడమీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఉత్తమ సర్పంచ్ విభాగంలో అన్నాడి శ్రీజను, ఉత్తమ సేవా విభాగంలో అన్నాడి జీవన్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ పురస్కారాలను నవంబర్ 15న న్యూఢిల్లీలో నిర్వహించనున్న బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ మహాసభలో ప్రదానం చేయనున్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ, సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రజా ఉద్యమకారులు, సామాజిక సేవకులు, కవులు, రచయితలు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించి ఏటా ఈ అవార్డులను అందజేస్తున్నట్లు సెలెక్షన్ కమిటీ జాతీయ చైర్మన్, బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ అన్నాడి శ్రీజ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సహకారం, ప్రోత్సాహం వల్లే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఈ పురస్కారం గ్రామ ప్రజలకు అంకితమని తెలిపారు.వింజపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ దంపతులు జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అన్నాడి శ్రీజ, జీవన్ రెడ్డి దంపతులకు పలువురు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన దంపతులను అభినందించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save