K24 News Telugu
Date of Publish : 28/10/2026, 4:27 pm
Published By Katta Ravinder

రామగుండం పోలీస్ కమిషనరేట్

  • రక్తదానం ప్రాణదానంతో సమానం..ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

 మంచిర్యాల జిల్లా అక్టోబర్

తేది: 28-10-2026 తెలుగు కే న్యూస్ ప్రతినిధి గంగాధరి రాజయ్య

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని,ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన ఎస్‌ఐ భూమేష్, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు యువకులను సీపీ అభినందించారు.

రక్తదానం సమాజానికి ఎంతో మేలు చేసే గొప్ప సేవా కార్యక్రమమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించే రక్తం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని,ఆరోగ్యపరంగా అర్హత ఉన్న వారు స్వచ్ఛందంగా క్రమం తప్పకుండా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని సీపీ కోరారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ ఆర్. వెంకటేశ్వర్లు,జైపూర్ సీఐ నవీన్ కుమార్, ఎస్‌ఐ భూమేష్, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save