K24 News Telugu
Date of Publish : 28/10/2026, 9:07 pm
Published By Teegala sravan Kumar

సిరిసిల్లలో ‘సంపూర్ణేష్ బాబు’ సందడి!

  • ‘ప్యారడైజ్’ విజయంతో అభిమానులకు కృతజ్ఞతలు..
  • నవంబర్ 14న ‘కొబ్బరి మట్ట’ రీ రిలీజ్

సిరిసిల్ల పట్టణం, అక్టోబర్ 28, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి 

 సినీ హీరో సంపూర్ణేష్ బాబు బుధవారం సిరిసిల్ల పట్టణంలో సందడి చేశారు. స్థానిక ఈశ్వరీ డెంటల్ క్లినిక్‌ను సందర్శించిన ఆయన అక్కడ ఉన్న అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా యువత సంపూర్ణేష్ బాబుతో సెల్ఫీలు తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘ప్యారడైజ్’ సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు సంపూర్ణేష్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనదైన హాస్యంతో ప్రేక్షకులను అలరించిన ‘కొబ్బరి మట్ట’ చిత్రాన్ని నవంబర్ 14న మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను నటించనున్న మరో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, డాక్టర్ ఆకాంక్ష తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save