K24 News Telugu
Date of Publish : 28/10/2026, 9:07 pm
Published By Teegala sravan Kumar

తంగళ్లపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి!

రాజన్న సిరిసిల్ల జిల్లా , అక్టోబర్ 28, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

సాగునీరందక అల్లాడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో మానేరు బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది.

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 11/6 ప్యాకేజీ కాలువ పనులను తక్షణమే పూర్తి చేసి, తంగళ్ళపల్లి మండల రైతాంగానికి న్యాయం చేయాలని. ప్రభుత్వం వెంటనే స్పందించి కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే రైతులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save