రాజన్న సిరిసిల్ల జిల్లా , అక్టోబర్ 28, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వాత్సల్య ఫౌండేషన్ మరియు మిత్ర బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో బుధవారం 17వ (ఐఆర్) పోలీస్ బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెటాలియన్ కమాండెంట్ శ్రీ పి.జె.పి.సి. ఛటర్జీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 58 మంది పాల్గొన్నారు.