K24 News Telugu
Date of Publish : 29/10/2026, 9:22 pm
Published By Gunnala Surendar

జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

  • రైతులు తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి మున్సిపల్‌ కమిషనర్లు, మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. యాసంగిలో రైతులు తక్కువ నీరు అవసరమయ్యే కూరగాయలు, పప్పుదినుసుల వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.

ఆరుతడి పంటలకు అవసరమైన మేరకే సాగునీటిని వినియోగించుకునేలా రైతులకు సబ్సిడీపై రెయిన్‌గన్లు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒక్కో రెయిన్‌గన్‌ యూనిట్‌ ధర రూ.24 వేలు కాగా, రైతులు రూ.8 వేలు చెల్లిస్తే మిగతా రూ.16 వేలను ప్రభుత్వం రాయితీగా భరిస్తుందని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save