K24 News Telugu
Date of Publish : 30/10/2026, 7:59 am
Published By KOMPELLY BHAGAVAN

టీయూడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా గడ్డం స్వామి.

దుబ్బాక: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్‌) సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శిగా బతుకమ్మ టీవీ రిపోర్టర్ గడ్డం స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దుబ్బాకలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా గడ్డం స్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్న జర్నలిస్టు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. జర్నలిస్టు మిత్రులకు ఎల్లవేళలా అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save