రాజన్న సిరిసిల్ల :జిల్లా కేంద్రంలోని చంద్రంపేట బైపాస్ చౌరస్తాలో ఒక లైన్‌మెన్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదానికి మున్సిపల్ కమిషనర్, ఆర్అండ్బి (R&B) అధికారులే పూర్తి బాధ్యత వహించాలి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఇక్కడ చెట్లు అడ్డంగా పెరిగిపోయాయి. దానికి తోడు 45 డిగ్రీల మలుపు ఉన్న ఈ రోడ్డులో ఎదురుగా అటు నుండి వచ్చే వాహనాలు ఏమాత్రం కనిపించడం లేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అడ్డుగా ఉన్న చెట్లు తొలగించాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ కనీసం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. తక్షణమే ఆ రోడ్డులో అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, భద్రతా చర్యలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.