K24 News Telugu
Date of Publish : 30/10/2026, 10:04 pm
Published By Teegala sravan Kumar

విద్యతోపాటు విభిన్న అంశాల్లో విద్యార్థుల ప్రతిభ.

  • జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
  • ఉత్తమ చిత్రాలు గీసిన టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జేసీ బోయినపల్లి విద్యార్థులకు అభినందన

రాజన్న సిరిసిల్ల జిల్లా , అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ప్రభుత్వ విద్యాలయాల లోని విద్యార్థులు విద్యతో పాటు విభిన్న అంశాల్లో ప్రతిభ చూపుతున్నారని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. బోయినపల్లిలోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జేసీ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థులు కె. వెంకటేష్ బాబు, కె. కార్తీక్ కె. శ్రీవాస్తవ్, యు.రాణాప్రతాప్ గీసిన చిత్రాలను శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించి ఆ విద్యార్థులను అభినందించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, మ్యూజిక్ లో ప్రతిభ చూపుతున్నారని కొనియాడారు. టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జేసీ బోయినపల్లి విద్యార్థులు గురుకుల విద్యాసంస్థల రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారని తెలిపారు. అలాగే టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ లో సైతం అర్హత సాధించారని వెల్లడించారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటుగా ఖాళీ సమయాల్లో విద్యాసంస్థల్లో ఉన్న టీచర్ల సహాయంతో తమకు ఇష్టం ఉన్న అంశాల్లో నైపుణ్యాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడలు లేదా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, మ్యూజిక్ లో నిత్యం సాధన చేయాలని సూచించారు. 

కార్యక్రమంలో బోయినపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథం, ఆర్ట్ టీచర్ వీణా దేవి విద్యార్థులు ఉన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save