రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
