K24 News Telugu
Date of Publish : 30/10/2026, 9:56 pm
Published By KOMPELLY BHAGAVAN

దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి – CPM డిమాండ్

  • దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, దుబ్బాక మండలంలో IKP, PACS సొసైటీల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ CPM పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో CPM పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు G. భాస్కర్‌తో పాటు నాయకులు MD. సాదిక్, కంపే ఎల్లయ్య, శ్రీనివాస్, MD. సాజిద్, లక్ష్మీనర్సయ్య, కృష్ణాహరి, బొప్పారం స్వామి, S. స్వామి తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save