K24 News Telugu
Date of Publish : 30/10/2026, 10:01 pm
Published By KOMPELLY BHAGAVAN

విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం.. భూంపల్లి పాఠశాలకు బోరు మంజూరు

  • బక్కి వెంకటయ్య, సర్పంచ్ జన్నారెడ్డి ప్రత్యేక చొరవతో బోరు ఏర్పాటు.

దుబ్బాక - భూంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాఠశాలలో నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామ సర్పంచ్ జన్నారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో మాట్లాడి బోరును మంజూరు చేయించారు.

మంజూరైన బోరును  బక్కి వెంకటయ్య, సర్పంచ్ జన్నారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వారి సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమానికి సహకరించినట్లు వారు తెలిపారు. పాఠశాలలో తాగునీటి సమస్య తీరడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన బక్కి వెంకటయ్య, సర్పంచ్ జన్నారెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాల్శెట్టి నందం, వార్డు సభ్యులు కొండలు, శ్రీకాంత్, ప్రవీణ్, అక్బర్‌పేట-భూంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మండల కుమార్, భూంపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దోమకొండ నర్సింలు, హెడ్‌మాస్టర్ రాజేందర్, రూరల్ వాటర్ వర్క్స్ శ్రీరాములు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save