K24 News Telugu
Date of Publish : 31/10/2026, 10:00 am
Published By Gunnala Surendar

విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

K24NEWS నిజామాబాద్ జిల్లా, నందిపేట: పోలీస్ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నందిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ విద్యార్థులకు పోలీసుల విధులు, బాధ్యతలు, ఫిర్యాదు చేసే విధానం, పోలీసుల కమ్యూనికేషన్ వ్యవస్థ, నేర పరిశోధన తదితర అంశాలపై అవగాహన కల్పించారు.పోలీసులు నిత్యం నిర్వహించే విధులు, ప్రజలకు అందించే సేవలు, నేరాల నియంత్రణలో అనుసరించే విధానాలను వివరించారు. పోలీస్ వ్యవస్థపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్, అక్షర స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save