K24 News Telugu
Date of Publish : 31/10/2026, 12:45 pm
Published By Teegala sravan Kumar

సిరిసిల్ల నర్సింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన.

  • సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ శ్రీనివాస్ సూచన

రాజన్న సిరిసిల్ల జిల్లా ,కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు సిరిసిల్ల టౌన్ సీఐ ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మి వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రాజు, అభిషేక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save