K24 News Telugu
Date of Publish : 31/10/2026, 12:47 pm
Published By Teegala sravan Kumar

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు.

  • ప్రజా రక్షణే కాదు.. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా పోలీసుల బాధ్యత .

ఎల్లారెడ్డిపేట మండలం, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఈ రోజు ఉదయం ఓ మహిళ అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రోడ్డుపై కుప్పకూలిపోయింది. అదే సమయంలో విధి నిర్వహణలో భాగంగా అటుగా వెళ్తున్న బ్లూకోట్ పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిలు ఈ విషయాన్ని గమనించారు.వెంటనే స్పందించిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహిళ వద్దకు చేరుకుని మానవతా దృక్పథంతో ప్రథమ చికిత్స అందిస్తూ, ఆమె చేతులు, కాళ్లు రుద్దడంతో కొద్దిసేపటికే ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. విధి నిర్వహణలో ఉన్నప్పటికీ తోటి మనిషి ప్రాణాపాయ పరిస్థితిలో ఉండటాన్ని గమనించి వెంటనే స్పందించిన కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిల లను ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు అభినందిస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save