రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. భారత తొలి ఉప ప్రధాని, మాజీ హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అదనపు అధికారి జయశ్రీ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఉద్యోగులు, సిబ్బంది ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించడమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థలను భారతదేశంలో విలీనం చేసిన ఉక్కుమనిషి పటేల్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఏవో రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది నిర్వహించారు.