K24 News Telugu
Date of Publish : 31/10/2026, 8:37 pm
Published By P RAJESHKUMAR

పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం

కే 24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) అక్టోబర్ 31.  చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమం సోసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో అనాథల కోసం ప్రత్యేకంగా అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ కార్యనిర్వాహకులు బండి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి శనివారం అనాథల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. సమాజంలో నిరాశ్రయులకు అండగా నిలవడమే తమ ధ్యేయమని ఆమె. ఈ కార్యక్రమంలో శ్రీధర్ యాదవ్, కృష్ణమానాయుడు, హరీష్, పుష్పరాజ్, త్యాగాలు రెడ్డి, తుకారాం రెడ్డి, బుజ్జి బాబు, భూపతి రెడ్డి, బాలాజీ, శేఖర్, రవి ఆధ్వర్యంలో ఉత్సాహంగా పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించి ఆశ్రమవాసులకు అండగా నిలిచారు. స్థానిక ప్రజలు మరియు యువత ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేసారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save