రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
యూడీఐడీ దరఖాస్తుల పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశించారు. యూడీఐడీ దరఖాస్తులు, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ అంశంపై సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ శనివారం జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూడీఐడీ దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని సూచించారు. సెర్ప్ నుంచి అన్ని జిల్లా దవాఖానలకు పంపిన వైద్య పరీక్షల యంత్రాలు పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. వైకల్య నిర్ధారణ పరీక్షలు వచ్చే వారికి అన్ని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వచ్చిన రోజే పూర్తి స్థాయిలో అన్ని పరీక్షలు చేసి పంపేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ ఆరా తీసి విద్యార్థులకు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తి అయిందని అధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో యూడీఐడీ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 2025 మార్చి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 3,590 యూడీఐడీ కార్డులు జారీ చేశామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శరత్, జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ తదితరులు ఉన్నారు.