ఎల్లారెడ్డిపేట మండలం, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్ దరఖాస్తు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. సేవలపై ఆరా తీశారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కుల, ఆదాయం, నివాసం ఇతర ధృవీకరణ పత్రాల కోసం, చెల్లింపుల కోసం వచ్చే అర్హులకు అందుబాటులో ఉండి.. సేవలు అందించాలని సూచించారు. భూముల రీ సర్వే పనులు పకడ్బందీగా పూర్తి చేయడానికి. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పకడ్బందీగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
