కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) అక్టోబర్ 31. గంగాధరనెల్లూరు మండలం నందనూరు మరియు పాపిరెడ్డిపల్లి పంచాయతీ సెగ్మెంట్ పరిధిలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం రాత్రి వైయస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె.రూప కుమార్ రెడ్డి హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ప్రజల మద్దతు ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని రూప కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్థులు మరియు పార్టీ నాయకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.స్థానిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.