రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా ఎస్పీ మహేష్ బీ. గీతేల ను శనివారం మర్యాదపూర్వకంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రోగ్రాం ఇన్చార్జి ఎండి సత్తార్ లు కలిసి నవంబర్ 3వ తేదీ మంగళవారం నిర్వహించనున్న తెలుగు ఫోక్ అసోసియేషన్ – తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
తెలుగు ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్, ఉపాధ్యక్షుడు జి.ఎల్. నాందేవ్, ప్రచార కార్యదర్శి ఆకునూరి దేవయ్య, గౌరవ సభ్యులు ఎడుమల శ్రీధర్ రెడ్డి, మాట్ల తిరుపతి, నక్క శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్లు కాయితోజు ప్రవీణ్, సాంబారి నవీన్, వేముల సతీష్, శ్రీరాముల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.