K24 News Telugu
Date of Publish : 02/11/2026, 3:28 pm
Published By srikanth

టేక్రియాల్ చెరువులో నిమజ్జన వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అదేశం

  • నీటి కాలుష్యాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలి

కామారెడ్డి జిల్లా నవంబర్ 2: k24 న్యూస్ తెలుగు :     కామారెడ్డి పట్టణంలోని టేక్రియాల్ చెరువులో నిమజ్జనం అనంతరం పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, నీటి కాలుష్యాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిమజ్జన వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించి, చెరువు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లలిత చిట్టిబాబు, డిఈ హన్మంత్ రావు,ఏఈ వేణు ప్రసాద్,శానిటేషన్ ఇంచార్జ్ ప్రశాంత్, నాయకులు రాములు,సంజీవ్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save