K24 News Telugu
Date of Publish : 02/11/2026, 6:00 pm
Published By Teegala sravan Kumar

క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపాలి ఉన్నత స్థానాలకు ఎదగాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్

  • యువ క్రికెట్ క్రీడాకారిణికి క్రికెట్ కిట్, సామగ్రి అందించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 02 కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

క్రికెట్ పోటీల్లో గూడెపు వంశిక ఉత్తమ ప్రతిభ చూపాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ఈ నెల 12 వ తేదీ నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయిలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్లో రాష్ట్రం తరఫున జిల్లా నుంచి ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన గూడెపు వంశిక పాల్గొననున్నది. ఆ క్రీడాకారిణికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పోర్ట్స్ కిట్, సామగ్రి అందజేసి అభినందించారు. నిత్యం సాధన చేయాలని, మంచి ప్రతిభ చూపి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాసు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save