K24 News Telugu
Date of Publish : 02/11/2026, 6:08 pm
Published By Teegala sravan Kumar

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటక, చారిత్రక ఖ్యాతిని మరింత చాటాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్.

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ వద్ద ఉన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో ఉన్న వీ టీ ఏ డీ ఏ పార్క్, నాంపల్లి గుట్ట కు సంబంధించిన ఉత్తమ రీల్స్, వీడియోలు రూపొందించి.. అలాగే ఎక్కువ వ్యూస్ వచ్చిన వారికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ నగదు బహుమతులు అందజేసి.. అభినందించారు. 

మొదటి బహుమతి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల సిరిసిల్లకు చెందిన ఎం ప్రణవి అండ్ టీంకు రూ.15 వేలు, రెండో బహుమతి సిరిసిల్లకు చెందిన మిట్టపెల్లి రాకేష్ కు రూ.10వేలు, మూడో బహుమతి బోయినపల్లి మండలం దుండ్రపల్లికి చెందిన కడకుంట్ల రాకేష్ కు రూ. ఐదు వేల నగదు బహుమతి జిల్లా కలెక్టర్ అందజేశారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాల ఖ్యాతిని సోషల్ మీడియా, వివిధ వేదికల ద్వారా ఆయా ప్రాంతాల విశేషాలు అందరికీ తెలిసేలా సృజనాత్మకంగా రీల్స్ రూపొందించాలని సూచించారు. యువత, ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించే మరిన్ని వీడియోలు రూపొందించి .. విస్తృత ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. 

బహుమతులు సాధించిన రీల్స్, వీడియోల లింకులు..

21. M. Pranavi https://youtu.be/2SXkTwJTX3s?si=XB1h6VTndfH0mC1S

16. https://www.instagram.com/reel/Ddd7KjHh27F/?stkn=MXc2dmdlNWU0dDE1aQ%3D%3D

13. 2nd link https://www.instagram.com/reel/DdgmIIBzbCc/?stkn=N201ZWNnYzV4amp5

కార్యక్రమంలో యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, డీటీసీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save