K24 News Telugu
Date of Publish : 02/11/2026, 11:37 pm
Published By Teegala sravan Kumar

21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

  • నల్ల దుస్తుల్లో నిరసన ర్యాలీ
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 02,  కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ NHM ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా, గాంధీ చౌక్ వరకు సాగి, నేతన్న విగ్రహం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో NHM ఉద్యోగులు స్రవంతి, లక్ష్మీ ప్రసన్న, నవీన్, ప్రియదర్శిని, సంతోష, మీరాయ, చందు, అంజలి, శ్వేత, వసంత, హేమ మంజుల, అనిత తదితరులు పాల్గొన్నారు. 

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save