హైదరాబాద్, నవంబర్ 2: ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ పేరిట బీజేపీ నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. తెలంగాణలో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే తనతోపాటే నినాదాలు చేయాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం అమిత్ షా బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేద్దామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ఇక్కడి అరాచకశక్తులను తుదముట్టిద్దామని చెప్పారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని కేంద్ర హోంమంత్రి ధీమా వ్యక్తం చేశారు