K24 News Telugu
Date of Publish : 02/11/2026, 6:52 pm
Published By srikanth

కామారెడ్డిలో జిల్లా స్థాయి RTI కమిటీ ఏర్పాటు చేయాలి

  • జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన RTI కమిటీ ప్రతినిధులు

కామారెడ్డి జిల్లా నవంబర్ 2: k24 న్యూస్ తెలుగు :    సమాచార హక్కు చట్టం–2005 సమర్థవంతమైన అమలుకు కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయి సమాచార హక్కు (RTI) కమిటీని ఏర్పాటు చేయాలని   RTI కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో RTI కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు, జిల్లా స్థాయి మానిటరింగ్ సభ్యుల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో RTI సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌కు తగిన ప్రతిపాదనలు పంపించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొడిప్యాక సాయిరాం, సోషల్ మీడియా ఇన్ఛార్జ్  రౌతు శ్రీకాంత్  కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్  అత్తిమాముల సతీష్,

 కామారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు పిట్ల స్వామి, కామారెడ్డి నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ బొజ్జ నరేష్ కుమార్,దోమకొండ మండల ప్రెసిడెంట్  బొజ్జ స్వామి, కామారెడ్డి మున్సిపాలిటీ ఇంచార్జ్  వంగ భాస్కరాచారి,

 కామారెడ్డి ఎగ్జిక్యూటివ్  భాను ప్రకాష్,

 ఇసన్న పల్లి గ్రామ అధ్యక్షుడు వంశీ,  తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save