K24 News Telugu
Date of Publish : 02/11/2026, 6:56 pm
Published By Teegala sravan Kumar

తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి.

  • మంగళవారం సిరిసిల్లలో భారీగా సాంస్కృతిక వేడుకలు..
  • అన్ని పార్టీల నాయకులు, జానపద కళాకారుల హాజరు.

 సిరిసిల్ల పట్టణం, నవంబర్ 02,  కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

తెలంగాణ జానపద కళాకారుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను మంగళవారం సిరిసిల్లలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం ఇన్‌చార్జి ఎండీ సత్తార్ తెలిపారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జానపద కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళాప్రతిభను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

జానపద కళలకు, కళాకారులకు గుర్తింపు తీసుకురావడంతో పాటు వారి ఐక్యతకు ఈ ఆవిర్భావ సభ వేదికగా నిలవనుందని పేర్కొన్నారు. ప్రజలు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎండీ సత్తార్ పిలుపునిచ్చారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save