K24 News Telugu
Date of Publish : 02/11/2026, 11:29 pm
Published By P RAJESHKUMAR

వైయస్సార్సీపి ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల గుణశేఖర్ రెడ్డి విస్తృతస్థాయిలో ప్రచారం

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి రాజేష్ కుమార్) నవంబర్ 2. గంగాధరనెల్లూరు పంచాయతీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్సీపి ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల గుణశేఖర్ రెడ్డి విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు. గంగాధరనెల్లూరు హరిజనవాడ గ్రామంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని షర్మిల గుణశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించాలని కోరారు. పార్టీ శ్రేణులు సైతం స్థానికంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు హరిబాబు, ముష్టిపల్లి వెంకటేష్, మోహన్, గౌతమ్, జయసు, గోవిందమ్మ, ఇంద్రాణి, ఉష రేఖ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save