కరీంనగర్ తెలుగు కే న్యూస్ నవంబర్ 2
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తల్లి మరణం తండ్రి జైలుకు అనాథగా మిగిలిన ఏడేళ్ల చిన్నారికి పోలీసుల అండ చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన కరీంనగర్ రూరల్ పోలీసులు గత నెల 25-10-2026 రాత్రి మగపిల్లవాడు పుట్టలేదనే కారణంతో భార్యను హత్య చేసిన భర్త దావు చంద్రకుమార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. వీరికి గతంలో ఏడేళ్ల వయస్సు గల దావు మహాన్య అనే కుమార్తె ఉంది తల్లి మరణించగా, తండ్రి జైలులో ఉండటంతో చిన్నారి మహాన్య అనాథగా మిగిలింది ఆమెను చూసుకునే బాధ్యత కలిగిన తాత కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చిన్నారి సంరక్షణ, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈ విషయం తెలుసుకున్న కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం కరీంనగర్‌లోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు వెంటనే స్పందించి ఔట్రీచ్ వర్కర్ ఎన్. స్వరూపను పోలీస్ స్టేషన్‌కు పంపించారు. చిన్నారి భవిష్యత్తు, సంరక్షణ, విద్యను దృష్టిలో ఉంచుకొని, ఆమె తాత సమక్షంలో కరీంనగర్ రూరల్ పోలీసులు చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) వారికి అప్పగించారు ఈ సందర్భంగా చిన్నారిని సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి అప్పగిస్తున్న సమయంలో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ పోలీస్ సిబ్బంది, ప్రజలు ఆమెకు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు ఈ మానవీయ కార్యక్రమంలో చొరవ చూపిన ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఔట్రీచ్ వర్కర్ స్వప్నను ప్రజలు అభినందించారు పోలీసుల విధి కేవలం నేరాలను నియంత్రించడం మాత్రమే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి,అవసరమైన వారికి భరోసా కల్పించడం కూడా పోలీసుల బాధ్యత అని అన్నారు