నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం: ఉమ్మెడ గ్రామంలో సోమవారం ఊర పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని దేవతలకు గోదావరి నది నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు గ్రామ పొలిమేరలు దాటకుండా ముడుపులు కట్టారు.
దాదాపు తొమ్మిది రోజులపాటు ఈ పండుగలో భాగంగా పాడిపంటలు, పశువులు, గ్రామ ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సుఖసంతోషాలతో ఉండాలని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం గ్రామస్థులంతా ఐక్యంగా ఈ ఊర పండుగను ఘనంగా నిర్వహించారు.