రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 03, కే24 తెలుగు కే న్యూస్ ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎల్‌సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) సర్వేలో భాగంగా రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ లత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి రామ్ రెడ్డి తో కలిసి పట్టణంలోని పీహెచ్‌సీ తంగళ్ళపల్లి పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, ఇంటింటి సర్వే ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అనుమానిత కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఎలా గుర్తిస్తున్నారు అనే అంశాలను పరిశీలించారు. సర్వేలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరీక్షించాలని సూచించారు. అనుమానిత కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి, వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన చికిత్స అందించాలని తెలిపారు.ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ రామ్ రెడ్డి మాట్లాడుతూ, LCDC survey కంపెయిన్ ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది, కావున ఆశాలు ఏఎన్ఎంలు సర్వే ను పూర్తి చేయవలెను, కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించి, సర్వేకు పూర్తి వివరాలు అందించాలని కోరారు. సర్వేను నాణ్యతతో, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ లత గారు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రామ్ రెడ్డి గారు, డీపీఎంఓ ఇ.దేవ్ సింగ్, వైద్య సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.