రుద్రంగి మండలం, నవంబర్ 03 కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
రుద్రంగి మండలం మానాల అంగన్‌వాడీ మంగళవారం 10 నిమిషాల తర్వాత జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి చూపారు. ముందుగా అంగన్వాడి పిల్లల ఎత్తు బరువును పరిశీలించారు. సామ్, మామ్ పిల్లలపై ఆరా తీశారు. అంగన్వాడీ ఆరో వాటర్ యంత్రం పనితీరు, ఫ్యాన్లు, లైట్లు పరిశీలించారు. అలాగే ప్రాథమిక పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తుండగా, తనిఖీ చేశారు. తరగతి గదులు కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా పోషణ మాసం ప్రాముఖ్యతను గర్భిణులు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలకు అన్నప్రాసన చేశారు.