K24 News Telugu
Date of Publish : 04/11/2026, 7:45 am
Published By Teegala sravan Kumar

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు.

  • విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి.–ప్రిన్సిపాల్ విజయ రఘునందన్.

 సిరిసిల్ల పట్టణం, నవంబర్ 03, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక, ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. మానసిక ధైర్యం, ఆత్మబలాన్ని పెంపొందించుకొని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం వివిధ కోర్సుల్లో ప్రాధాన్యతతో పాటు అనేక అవకాశాలు కల్పిస్తోందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు, వారి విద్యాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కళాశాల అభివృద్ధికి సైతం ఆర్థిక సహకారం అందించేందుకు దాతలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. అనంతరం కళాశాలలో పనిచేసి పదవీ విరమణ పొందిన బుర్ర వెంకటేశం, అరుంధతి, బదిలీపై వెళ్లిన లెక్చరర్ కేదారేశ్వర్‌లను కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు టీ.శ్రీధర్, సామల వివేకానంద, కనకయ్య, చంద్రమౌళి, చంద్రశేఖర్, ఆంజనేయులు, విజయ, శ్రీనివాస్, సురేష్, రాజయ్య, శశిధర్, రాజశేఖర్, సుజిత, సాగర్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save